సోమవారం 13 జూలై 2020
Telangana - Jun 08, 2020 , 19:23:19

షేక్‌పేట ఎమ్మార్వో సుజాత అరెస్ట్‌

షేక్‌పేట ఎమ్మార్వో సుజాత అరెస్ట్‌

హైదరాబాద్‌:  బంజారాహిల్స్‌ భూవివాదం కేసులో షేక్‌పేట ఎమ్మార్వో సుజాతను ఏసీబీ అధికారులు అరెస్ట్‌ చేశారు. ఖలీద్‌ అనే వ్యక్తి నుంచి లంచం తీసుకున్నట్లు అధికారులు ఆధారాలు సేకరించారు.   వైద్య పరీక్షల కోసం సుజాతను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. వైద్య పరీక్షల అనంతరం ఆమెను జడ్జి ఎదుట హాజరుపర్చనున్నారు. బంజారాహిల్స్‌ రూ.40కోట్ల రూపాయల భూ వ్యవహారంలో సుజాతను అధికారులు విచారించారు. 

రూ.15లక్షలు లంచం తీసుకుంటూ రెవెన్యూ ఇన్స్‌పెక్టర్‌ నాగార్జున రెడ్డి ఏసీబీకి దొరికిన విషయం తెలిసిందే.  సుజాత ఇంట్లో దొరికిన 30 లక్షల రూపాయలకు సుజాత సరైన ఆధారాలు చూపించలేకపోయింది. భూ వివాదంలో ఎమ్మార్వో సుజాత పాత్ర ఉన్నట్లు ఏసీబీ గుర్తించింది. ఈ కేసులో బంజారాహిల్స్‌ ఎస్సై రవీంద్ర నాయక్‌, నాగార్జున రెడ్డిని  ఇప్పటికే రిమాండ్‌కు తరలించారు. 


logo