ఆదివారం 24 జనవరి 2021
Telangana - Nov 21, 2020 , 09:24:47

కామారెడ్డి పట్టణ సీఐని అరెస్ట్‌ చేసిన ఏసీబీ

కామారెడ్డి పట్టణ సీఐని అరెస్ట్‌ చేసిన ఏసీబీ

నిజామాబాద్‌ : కామారెడ్డి పట్టణ సీఐ జగదీశ్‌తో పాటు మరో వ్యక్తిని అవినీతి నిరోధకశాఖ అధికారులు శుక్రవారం రాత్రి అరెస్టు చేశారు. అనంతరం వారిని కరీంనగర్‌లోని అవినీతి నిరోధక శాఖ న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. ఐపీఎల్‌ బెట్టింగ్‌ వ్యవహారంలో సీఐ రూ.5లక్షల లంచం డిమాండ్‌ డిమాండ్‌ చేయగా.. నిందితుడి నుంచి రూ.1.39లక్షలు లంచం మరో వ్యక్తి నుంచి తీసుకున్నాడు. ఈ మేరకు ఏసీబీ అధికారులు శుక్రవారం ఉదయం 7.30 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఏకకాలంలో పట్టణ పోలీస్‌స్టేషన్‌తో పాటు సీఐ ఇంట్లో సోదాలు నిర్వహించారు.

సీఐ జగదీశ్ ఐపీఎల్‌ బెట్టింగ్‌ కేసులో బెయిల్‌ ఇవ్వడానికి బత్తుల సుధాకర్‌కు రూ.5 లక్షలు ఇవ్వాలని డిమాండ్‌ చేశాడు. దీంతో సుజయ్‌ అనే వ్యక్తిద్వారా సుధాకర్‌ నుంచి రూ.లక్షా 39 వేలు సీఐ తీసుకున్నారని ఏసీబీ అధికారులు గుర్తించారు. మిగతా డబ్బులు కోసం వేధిస్తుండడంతో సుధాకర్‌ ఏసీబీని ఆశ్రయించాడు. కాగా.. దాడుల సమయంలో పోలీస్‌ స్టేషన్‌లో పలు కేసులకు సంబంధించిన ఫైళ్లను ఏసీబీ అధికారులు పరిశీలించినట్లు సమాచారం. స్టేషన్‌లో సిబ్బందిని కూడా విచారించారు. దాడులకు సంబంధించి ఏసీబీ అధికారు లు 15 రోజులుగా రెక్కీ నిర్వహిస్తున్నట్లు తెలిసింది. 


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo