సోమవారం 06 జూలై 2020
Telangana - Jun 30, 2020 , 22:52:11

జోరుగా ఆరోవిడుత హరితహారం

జోరుగా ఆరోవిడుత హరితహారం

జనగామ : ఆరోవిడుత హరితహారం జిల్లాలో జోరుగా సాగుతున్నది. మంగళవారం అధికారులు, ప్రజాప్రతినిధులు గ్రామగ్రామాన మొక్కలు నాటారు. జిల్లా కేంద్రంలోని పాతశీతలీకరణ కేంద్రంలో ఫిషరీస్‌, వెటర్నరీ, డైరీ ప్రిన్సిపాల్‌ సెక్రెటరీ అనితారాజేందర్‌ మొక్కలు నాటి నీళ్లు పోశారు. మొక్కలతో మానవ మనుగడకు విడదీయలేని సంబంధం ఉందని పేర్కొన్నారు. హరిత తెలంగాణ సాధనకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని ఆమె కోరారు. రాష్ట్రంలో అటవీ విస్తీర్ణం పెంచాలనే ఉద్దేశంతో ప్రభుత్వం హరితహారం కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని తెలిపారు. నాటి ప్రతి మొక్కనూ ఎండిపోకుండా సంరక్షించాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో మేనేజింగ్‌ డైరెక్టర్‌ శ్రీనివాస్‌రావు, డిప్యూటీ డైరెక్టర్‌ రమేశ్‌, సోమిరెడ్డి, సూపర్‌వైజర్‌ నాగరాజు, వెంకట్‌రెడ్డి, జైసింహారెడ్డి, శ్రీనివాస్‌, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.


logo