శనివారం 26 సెప్టెంబర్ 2020
Telangana - Aug 30, 2020 , 14:58:28

పరిసరాల పరిశుభ్రతతోనే సంపూర్ణ ఆరోగ్యం

పరిసరాల పరిశుభ్రతతోనే సంపూర్ణ ఆరోగ్యం

నిర్మల్ : ప్రతి ఆదివారం పది గంటలకు పది నిమిషాలు కార్యక్రమంలో భాగంగా నిర్మల్ లోని మంత్రి క్యాంపు కార్యాలయంలో అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పరిశుభ్రత కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇంటి ఆవరణలో గార్డెన్ ను శుభ్రం చేసి మొక్కలకు నీళ్లు పోశారు. 

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మంత్రి కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు అందరూ ప్రతి ఆదివారం పది గంటలకు పది నిమిషాల శుభ్రత కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. స్వచ్ఛతతోనే సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందన్నారు.

కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, జడ్పీటీసీ పి.రాజేశ్వర్ రెడ్డి, నాయకులు మురళీధర్ రెడ్డి, సురేందర్ రెడ్డి, ముత్యం రెడ్డి, చెనిగారపు నరేష్, మహేష్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.


logo