సోమవారం 01 జూన్ 2020
Telangana - May 10, 2020 , 12:43:06

స్వచ్ఛతతోనే సంపూర్ణ ఆరోగ్యం : స్పీకర్‌ పోచారం

స్వచ్ఛతతోనే  సంపూర్ణ ఆరోగ్యం : స్పీకర్‌ పోచారం

హైదరాబాద్‌ : సీజనల్ వ్యాధుల నివారణ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర పురపాలక శాఖ చేపట్టిన “ప్రతి ఆదివారం- పది గంటలకు- పదినిమిషాలు” కార్యక్రమంలో  అసెంబ్లీ స్పీకర్ శ్రీ పోచారం శ్రీనివాస రెడ్డి పాల్గొన్నారు.స్పీకర్  తన అధికారిక నివాసంలోని పూల కుండీల్లో చెత్తను, నిలువ నీటిని తొలగించి, తాజా నీటితో నింపారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ.. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. మనం ఆరోగ్యంగా ఉండాలంటే మనతో పాటు మన ఇంటి  పరిసరాలు పరిశుభ్రంగా ఉంచకోవాలన్నారు. పరిశుభ్రత తోనే మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చన్నారు. మంచి కార్యక్రమాన్ని ప్రారంభించిన పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌కుఅభినందనలు తెలిపారు. సీజనల్ వ్యాధుల నిర్మూలనకు ప్రజలంతా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఇంట్లోని నిల్వ చెత్తను, మురికి  నీటిని తొలగించినట్లయితే దోమలు పునరుత్పత్తి చెందవన్నారు. తద్వారా దోమల ద్వారా వ్యాపించే వ్యాధులు అంతమవుతాయని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ దీన్నొక సామాజిక కార్యక్రమంగా భావించి ప్రతి ఆదివారం తప్పనిసరిగా నిర్వహించాలని స్పీకర్ ప్రజలకు పిలుపునిచ్చారు.


logo