శనివారం 04 జూలై 2020
Telangana - Jun 14, 2020 , 12:44:00

స్వచ్ఛతతోనే సంపూర్ణ ఆరోగ్యం

స్వచ్ఛతతోనే సంపూర్ణ ఆరోగ్యం

మహబూబాబాద్ : పరిసరాల పరిశుభ్రత కోసం ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల 10 నిమిషాలు మీకోసం అంటూ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఇచ్చిన పిలుపులో భాగంగా.. గిరిజన సంక్షేమ శాఖ మంత్రి  సత్యవతి రాథోడ్ పరిశుభ్రత కార్యక్రమంలో పాల్గొన్నారు. మహబూబాబాద్ లోని తన నివాసంలో దోమలు నిల్వ ఉండే ప్రదేశాలను, ఇంటి ఆవరణలోని ప్రాంతాలను శుభ్రం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రతతోనే సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందన్నారు. ప్రతి ఒక్కరు స్వచ్ఛతా కార్యక్రమాల్లో పాల్గొని ఆరోగ్య తెలంగాణకు సహకరించాలన్నారు.


logo