హైదరాబాద్ : నగరంలోని గచ్చిబౌలిలోని టిమ్స్ ఆస్పత్రిని ప్రజా అవసరాలకు అనుగుణంగా మార్పు చేస్తూ దాన్ని సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిగా ఆధునీకరించాలని, దానికి తోడుగా మరో 3 సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులను నిర్మించాలని కేబినెట్ నిర్ణయించింది. కొత్తగా నిర్మించే మూడు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్‌ను చెస్ట్ హాస్పిటల్ ప్రాంగణంలో, గడ్డి అన్నారం ఫ్రూట్ మార్కెట్లో, అల్వాల్ నుంచి ఓఆర్ఆర్ మధ్యలో నిర్మించనున్నారు. కొత్తపేటలో ప్రస్తుతం ఉన్న కూరగాయల మార్కెట్‌ను పూర్తిగా ఆధునీకరించి ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్‌వెజ్ మార్కెట్‌గా మార్చాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి కేబినెట్ ఆమోదం తెలిపింది.