గురువారం 03 డిసెంబర్ 2020
Telangana - Nov 13, 2020 , 00:47:35

సీఎంఆర్‌ఎఫ్‌కు ఏబీ ఇన్‌బేవ్‌ రూ.50 లక్షలు

సీఎంఆర్‌ఎఫ్‌కు ఏబీ ఇన్‌బేవ్‌ రూ.50 లక్షలు

  • తిలక్‌నగర్‌ ఇండస్ట్రీస్‌ రూ.25 లక్షలు
  • సీఎస్‌కు చెక్కుల అందజేత

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: హైదరాబాద్‌లో వరద బాధితులను ఆదుకునేందుకు బెల్జియంకు చెందిన ప్రముఖ బేవరేజెస్‌ సంస్థ ఏబీ ఇన్‌బేవ్‌ రూ.50 లక్షలు, తిలక్‌నగర్‌ ఇండస్ట్రీస్‌ రూ.25 లక్షలు సీఎం సహాయ నిధికి విరాళాలు అందించాయి. ఏబీ ఇన్‌బేవ్‌ సంస్థ కార్పొరేట్‌ ఎఫైర్స్‌ హెడ్‌ దినకర్‌, సౌత్‌ ఏషియా కమర్షియల్‌ డైరెక్టర్‌ ఇషాంక్‌గుప్తా, తిలక్‌నగర్‌ ఇండస్ట్రీస్‌ ఏజీ ఎం టీ శ్రీధర్‌ విరాళాల చెక్కులను గురువారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌కు అందజేశారు.