శనివారం 05 డిసెంబర్ 2020
Telangana - Nov 12, 2020 , 15:53:47

బెల్జియం బేవ‌రేజెస్ సంస్థ రూ. 50 ల‌క్ష‌ల విరాళం

బెల్జియం బేవ‌రేజెస్ సంస్థ రూ. 50 ల‌క్ష‌ల విరాళం

హైద‌రాబాద్ : వ‌ర‌ద‌ల‌తో తీవ్రంగా న‌ష్ట‌పోయిన హైద‌రాబాద్ ప్ర‌జ‌ల‌ను ఆదుకునేందుకు బెల్జియంకు చెందిన ప్ర‌ముఖ బేవ‌రేజెస్ సంస్థ ABInBev,  తిల‌క్‌న‌గ‌ర్ ఇండస్ర్టీస్ లిమిటెడ్ కంపెనీ ముందుకు వ‌చ్చింది. సీఎం రిలీఫ్ ఫండ్‌కు భారీగా విరాళం ఇచ్చారు.  బేవరేజెస్ సంస్థ ABInBev ద‌క్షిణాసియాకు చెందిన కార్పొరేట్ ఆఫైర్స్ హెడ్ దిన‌క‌ర్‌, క‌మ‌ర్షియ‌ల్ డైరెక్ట‌ర్ ఇషాంక్ గుప్తా క‌లిసి ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సోమేశ్ కుమార్‌కు రూ. 50 ల‌క్ష‌ల చెక్కును అంద‌జేశారు. తిల‌క్‌న‌గ‌ర్ ఇండ‌స్ర్టీస్ లిమిటెడ్ కంపెనీ ఎజీఏం టీ శ్రీద‌ర్ కూడా సోమేశ్ కుమార్‌కు రూ. 25 ల‌క్ష‌ల చెక్కును అందించారు.