సోమవారం 28 సెప్టెంబర్ 2020
Telangana - Aug 04, 2020 , 18:26:12

బ్యాగు కలకలం.. శాలిబండలో భయాందోళన

బ్యాగు కలకలం.. శాలిబండలో భయాందోళన

హైదరాబాద్‌ : నగరంలోని పాతబస్తీ శాలిబండ ప్రాంతంలో ఓ బ్యాగు కాసేపు కలకలం సృష్టించింది. స్థానిక గౌతం స్కూల్‌ సమీపంలో స్థానికులు అనుమానాస్పదరీతిలో ఉన్న బ్యాగును గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వెంటనే బాంబ్‌ స్కాడ్‌ సిబ్బందిని అలర్ట్‌ చేశారు. స్నిఫర్‌ డాగ్‌తో బాంబ్‌ స్కాడ్‌ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. బ్యాగును తెరిచిచూసి అందులో బట్టలు, ఇతర వస్తువులు ఉండటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రయాణంలో ఉన్న ఆటో నుండి బ్యాగు పడినట్లుగా సమాచారం. రేపు అయోధ్య రామాలయ నిర్మాణానికి భూమి పూజ జరగనున్న నేపథ్యంలో సిటీ పోలీసులు అప్రమత్తమయ్యారు.


logo