గురువారం 09 జూలై 2020
Telangana - Jun 19, 2020 , 17:24:31

హుజూరాబాద్‌లో 'ఆలన' వాహనాలు ప్రారంభం

హుజూరాబాద్‌లో 'ఆలన' వాహనాలు ప్రారంభం

హైదరాబాద్‌ : కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌లో ఆలన వాహన సేవలను రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ నేడు ప్రారంభించారు. అవసానదశలో ఉన్నవారికి చికిత్స అందించేందుకు ఉపయోగించేవే ఆలన వాహనాలు. వాహనాల ప్రారంభం సందర్భంగా మంత్రి ఈటల మాట్లాడుతూ... దేశంలోనే మొదటిసారిగా ఇలాంటి చికిత్స అందిస్తున్న రాష్ట్రం తెలంగాణ అన్నారు. క్యాన్సర్‌, కిడ్ని సమస్యలు, ఇతర దీర్ఘకాలిక సమస్యలతో మంచానికే పరిమితమైన వారికి ఆలన ద్వారా సేవలను అందిస్తున్నట్లు తెలిపారు.

చనిపోయేదశలో ఉన్నవారికి కుటుంబ సభ్యులు సైతం సేవ చేయడానికి ముందుకు రాని నేపథ్యంలో ప్రభుత్వమే వారికి సేవ చేస్తుందన్నారు. అలాంటి వారి ఆలన చూసుకోనుందన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే 17 వాహనాలు సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. అనంతరం మంత్రి స్థానిక క్యాంప్‌ కార్యాలయంలో లబ్దిదారులకు సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను అందజేశారు.


logo