శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Telangana - Mar 04, 2020 , 10:16:50

ఆకాశవాణి న్యూస్‌ రీడర్‌ మృతి.. సీఎం కేసీఆర్‌ సంతాపం

ఆకాశవాణి న్యూస్‌ రీడర్‌ మృతి.. సీఎం కేసీఆర్‌ సంతాపం

హైదరాబాద్‌ : తన సుస్వరంతో రేడియో వార్తలు చదువుతూ శ్రోతల గుండెల్లో సుస్థిరస్థానం సంపాదించిన ఆకాశవాణి మాజీ న్యూస్‌ రీడర్‌ మాడపాటి సత్యవతి(80) ఇక లేరు. ఈ తెల్లవారుజామున 2 గంటల సమయంలో ఆమె మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అంత్యక్రియలు ఈ మధ్యాహ్నం జరుగనున్నట్లు వెల్లడించారు. సత్యవతి మృతి పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌ రావు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె సేవలను సీఎం గుర్తు చేసుకున్నారు. సుమారు నాలుగు దశాబ్దాలపాటు తన సుస్వరంతో రేడియో వార్తలు చదువుతూ లక్షలాది మంది శ్రోతల హృదయాల్లో సుస్థిరస్థానం సంపాదించుకున్నారని సీఎం కొనియాడారు.


logo