సోమవారం 25 జనవరి 2021
Telangana - Jan 06, 2021 , 20:01:27

బోయిన్‌ప‌ల్లి కిడ్నాప్ కేసు.. ఏ1 సుబ్బారెడ్డి నిందితుడు అరెస్టు

బోయిన్‌ప‌ల్లి కిడ్నాప్ కేసు.. ఏ1 సుబ్బారెడ్డి నిందితుడు అరెస్టు

హైద‌రాబాద్ : బోయిన్‌ప‌ల్లి కిడ్నాప్ కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న ఏవీ సుబ్బారెడ్డిని టాస్క్‌పోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టుపై సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. కిడ్నాప్ కేసులో త‌న‌ను ఏ1 గా ఎందుకు చేర్చారో తెలియ‌దని, బోయిన్‌ప‌ల్లి కిడ్నాప్ కేసుతో త‌న‌కెలాంటి సంబంధం లేద‌న్నాడు. ప్ర‌వీణ్‌రావుతో విభేదాలు వాస్త‌వ‌మేన‌ని అంగీక‌రించిన సుబ్బారెడ్డి హ‌ఫీజ్‌పేట్ భూ వివాదంపై ఇప్పుడు తానేమి మాట్లాడ‌లేనన్నాడు. అఖిల‌ప్రియ త‌న‌ను చంప‌డానికి సుపారి ఇచ్చింద‌ని గ‌తంలోనే కేసు పెట్టిన‌ట్లు చెప్పాడు. అలాంటి వారితో క‌లిసి తానెందుకు కిడ్నాప్ చేస్తాన‌న్నాడు. పోలీసు విచార‌ణ‌కు పూర్తిగా స‌హ‌కరించ‌నున్న‌ట్లు వెల్ల‌డించాడు. 

సంచల‌నం సృష్టించిన బోయిన‌ప‌ల్లి కిడ్నాప్ కేసును పోలీసులు మూడు గంట‌ల్లోనే చేధించారు. నిన్న రాత్రి మాజీ క్రీడాకారుడు ప్రవీణ్‌రావు ఆయన సోదరులు సునీల్‌, నవీన్‌లు కిడ్నాప్‌కు గురయ్యారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు తక్షణమే రంగంలోకి దిగి కేసును చేధించారు. కేసులో ఏ1గా ఏవీ సుబ్బారెడ్డి, ఏ2గా ఏపీ మాజీ మంత్రి అఖిల‌ప్రియ‌, ఏ3గా భార్గ‌వ్‌రామ్ ఉన్నారు. ఏ1, ఏ2 నిందితుల‌ను అరెస్టు చేసిన పోలీసులు ఏ3 నిందితుడు, అఖిల‌ప్రియ భ‌ర్త‌ భార్గ‌వ్‌రామ్ కోసం గాలింపు చ‌ర్య‌లు చేప‌ట్టారు. కిడ్నాప్‌పై పోలీసుల ద‌ర్యాప్తు ప్రారంభం కాగానే భార్గ‌వ్‌రామ్ అజ్ఞాతంలోకి వెళ్లాడు. ఆచూకీ కోసం సీసీ కెమెరా ఫుటేజీల్ని పోలీసులు పరిశీలిస్తున్నారు. 


logo