శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Telangana - Mar 14, 2020 , 07:14:48

కుటుంబ కలహాలతో వివాహిత ఆత్మహత్య

కుటుంబ కలహాలతో వివాహిత ఆత్మహత్య

హైదరాబాద్ : కుటుంబ కలహాలతో వివాహిత ఆత్మహత్య చేసుకున్నది. ఈ సంఘటన మీర్‌పేట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చేటుచేసుకుంది. సీఐ యాదయ్య కథనం ప్రకారం.. బడంగ్‌పేట మున్సిపల్‌ కార్పొరేషన్‌, త్రివేణి నగర్‌లో నివాసం ఉండే వందన (20)కు  గత నవంబర్‌లో నవీన్‌ కుమార్‌తో వివాహం జరిగింది. ప్రస్తుతం వందన  డిగ్రీ ఫైనల్‌ ఇయర్‌ చదువుతుంది. నవీ న్‌ క్యాటరింగ్‌లో పనిచేస్తున్నాడు. కాగా.. దంపతుల మధ్య మనస్పర్థలు వచ్చా యి. ఈ క్రమంలో శుక్రవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు.  


logo