శనివారం 04 ఏప్రిల్ 2020
Telangana - Mar 23, 2020 , 10:14:12

ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్య

ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్య

కరీంనగర్‌ : శంకరపట్నం మండలం కరీంపేటలో విషాదం నెలకొంది. హుజురాబాద్‌ ఎస్సార్‌ఎస్పీ కాల్వలో రెండేళ్ల పాప మృతదేహం లభ్యమైంది. నిన్న ఇద్దరు పిల్లలతో పాటు కరీంపేటకు చెందిన మహిళ అదృశ్యమైంది. ఇవాళ కుమార్తె అమ్ములు మృతదేహం ఎస్సార్‌ఎస్పీ కాల్వలో లభ్యమైంది. ఇద్దరు పిల్లలతో పాటు తల్లి ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ఎస్సార్‌ఎస్పీ ప్రధాన కాల్వలో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. పిల్లలతో బయటకు వెళ్తున్నానని చెప్పి ఇంటి నుంచి గడ్డం రమ్య వెళ్లిపోయింది. logo