మంగళవారం 26 మే 2020
Telangana - May 08, 2020 , 14:00:08

అయ్యో పాపం అనుకున్నాం.. కడుపు తరుక్కు పోతుంది

అయ్యో పాపం అనుకున్నాం.. కడుపు తరుక్కు పోతుంది

అయ్యోపాపం అనుకున్నాం కదరా మిమ్మల్నీ చూసి.. వండుకుని మరీ వచ్చి వడ్డించాం.. మిమ్మల్ని చూసి కడుపు తరుక్కుపోతుంది.. మందు షాపులు ఓపెన్‌ చేయంగనే బారులు తీరుతారా? అంటూ ఓ మహిళ మందుబాబులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. వైన్‌షాపు ముందు క్యూలైన్‌లో నిలబడ్డ వారిపై కట్టె తీసుకుని కొట్టేస్తా అంటూ బెదిరించింది. ఇంతకీ ఆమెకు ఎందుకింత కోపమొచ్చిందంటే...

లాక్‌డౌన్‌లో స‌రైన ఉపాధి లేక పేదవారు ఆక‌లితో అల‌మ‌టిస్తున్న‌ర‌ని, చేత‌నైన సాయం చేస్తున్నారు ఎంతో మంది. ఉన్నోళ్లు లేనోళ్ల‌కు దానం చేస్తున్నారు. కొంత మంది ఉన్నదాంట్లోనే కొంత ఇస్తున్నారు. ముసలవ్వలు దాచుకున్న పెన్షన్‌ డబ్బు పేదలకు పంచారు. ఇదంతా ఎందుకు చేస్తున్నారు. లాక్‌డౌన్‌లో ఉపాధి లేక తినడానికి ఇబ్బంది పడకూడదనే కదా. ఇలా సహాయం చేసినవారికి ఇప్పుడు కోపం వస్తున్నది.  వైన్‌షాపులు తెర‌వ‌డంతో క్యూలైన్లలో అందరూ లేనివారే నిలబడ్డారు.  ఓపిక తెచ్చుకొని మ‌రీ క్యూలో నిల్చుంటున్నారు. క‌నీసం సామాజిక దూరం కూడా పాటించ‌డం లేదు. 

ఈ పరిస్థితిని చూసిన ఓ మహిళకు ఆగ్రహం కట్టలు తెంచుకుంది. లాక్‌డౌన్‌ సమయంలో ఆమె ఎంతో మందికి వంట చేసి మరీ ఆకలి తీర్చింది.   చేతిలో చిల్లిగ‌వ్వ‌లేద‌ని చెప్పిన వాళ్లే ఇప్పుడు వైన్‌షాపు ద‌గ్గ‌ర క్యూలో నిల్చోవ‌డం చూసిన ఆమెకు ఒక్క‌సారిగా టెంప‌ర్ లేసింది. ఇక అంతే చేతిలో పెద్ద క‌ర్ర ప‌ట్టుకొని మందుబాబులను మందలించింది. ఆమెకు పోలీసులు కూడా మ‌ద్ద‌కు  ఇచ్చారు.  ఇప్పుడు ఈ వీడియో సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తున్న‌ది.logo