శుక్రవారం 29 మే 2020
Telangana - Apr 10, 2020 , 22:37:49

కరోనా కష్టం.. భర్తను కడసారి చూసుకోలేని దైన్యం

కరోనా కష్టం.. భర్తను కడసారి చూసుకోలేని దైన్యం

-మహారాష్ట్రలో భర్త చనిపోగా వెళ్లలేని స్థితిలో గిరిజన మహిళ

మంచిర్యాల : కట్టుకున్న భర్తను కడసారి చూసుకునేందుకు అవకాశం లేకుండా పోయింది ఓ గిరిజన మహిళకు. కరోనా ప్రభావం, లాక్ డౌన్ కారణంగా ఆమె తన భర్త అంత్యక్రియలకు హాజరు కాలేకపోయింది. కూలీ పనుల కోసం మహారాష్ట్ర నుంచి తెలంగాణలోని మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం రాంపూర్‌ గ్రామానికి జానకి అనే మహిళ వచ్చింది. 

ఈ నెల 5న జానకి భర్త దుర్వా పుచ్చి అనారోగ్యంతో చనిపోయాడు. వీరి స్వగ్రామం మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా ఏటపల్లి తాలుకాలోని తండా. కాగా ఈ గ్రామం తెలంగాణకు 160 కిలోమీటర్ల దూరంలో ఉండగా, లాక్‌డౌన్‌ ఆంక్షల కారణంగా జానకిని తీసుకెళ్లడానికి మహారాష్ట్ర నుంచి ఎవరూ రాలేదు. 

మహారాష్ట్ర పోలీస్‌లు కఠినంగా వ్యవహరిస్తుండడం, ఆమెను తీసుకెళ్లేందుకు తెలంగాణ సరిహద్దులకు రావాలంటే మహారాష్ట్రలోని మూడు పోలీస్‌స్టేషన్లు దాటి రావాల్సి ఉండడంతో బంధువులు రావడానికి వెనుకంజ వేశారు. దీంతో జానకి భర్త అంత్యక్రియలు కానిచ్చారు. ఈ గిరిజన ప్రస్తుతం మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం రాంపూర్‌ గ్రామంలో ఉంటుండగా, భర్త చనిపోయిన కడసాని చూసుకునేందుకు అవకాశం లేకుండా పోయిందని విలపిస్తోంది. ఆమెకు ముగ్గురు కొడుకులు, ఒక కూతురు ఉండగా, మహారాష్ట్రలో ఇంటి వద్దే ఉంటున్నారు. అధికారులు స్పందించి తనకు అనుమతి ఇప్పించి తన స్వగ్రామానికి పంపించాలని ఈ గిరిజన మహిళ వేడుకుంటోంది. 


logo