మంగళవారం 31 మార్చి 2020
Telangana - Mar 25, 2020 , 08:40:14

పాత బ‌ట్ట‌ల‌తో ప‌నికొచ్చేలా.. నెల వారీ ఆదాయం 5 వేలు

పాత బ‌ట్ట‌ల‌తో ప‌నికొచ్చేలా.. నెల వారీ ఆదాయం 5 వేలు

రాజ‌శ్రీ పాత, చిరిగిన దుస్తుల‌తో బ్యాగులు, క్విల్ట్స్, పర్సులు, డోర్మాట్స్‌, ఫోల్డర్లు వంటి ఉపయోగకరమైన వస్తువులుగా మారుస్తుంది. ప్రస్తుతానికి, ఆమె నెలవారీ ఆదాయం సుమారు 5,000 రూపాయలు.

 రాజశ్రీ పుణెవాసి. 2015 లో సంజీవని ప‌వార్‌, ఆమె స్నేహితుడు మాధురి జోషి ప్రారంభించిన సఖి అనే స్వయం సహాయక బృందంతో కలిసి ప‌నిచేసింది. ఒక‌ప్పుడు ఆమె ఇంటికి మాత్ర‌మే ప‌రిమిత‌మైంది. కానీ త‌న‌లో ఉన్న టాలెంట్‌ని స‌ఖి బృందం గుర్తించింది. "మా ప్రారంభ ప్రణాళిక రాజశ్రీకి మాత్రమే సహాయం చేయడమే, కాని ఆమె కుట్టిన ఉత్పత్తులను ప్రజలు మెచ్చుకోవటం ప్రారంభించడంతో మేము దీన్ని ఒక  ఉద్యమంలా చేప‌ట్టాం. పేదరికంతో బాధపడుతున్న ఇతర మహిళలను ఆశ్రయించి ఈ ఉత్ప‌త్తుల‌ను నేర్పించాం. మొద‌ట వాళ్లు కుట్టిన వాటిని కూడా మేమే అమ్మిపెడ‌తాం. క‌స్ట‌మర్లను కనుగొనే వరకు మేం వారికి సహాయం చేస్తాం ” అని జీవశాస్త్ర ప్రొఫెసర్ పవార్ చెప్పారు. వినియోగదారులు కూడా ఇకపై ఉపయోగించని వస్తువులను పంపవచ్చు. సరికొత్త యుటిలిటీ వస్తువులను పొంద‌వ‌చ్చు. స‌ఖి స‌హాయ‌క బృందం నిర‌క్ష‌రాస్య‌త ఉన్న గృహిణుల‌కు, చ‌దువుకొని బ‌య‌ట‌కు వెళ్ల‌లేని మ‌హిళ‌ల కోసం ఈ ఉపాధి కార్య‌క్ర‌మం చేప‌ట్టిన‌ట్టు ఆ బృందం చెబుతున్న‌ది.


logo
>>>>>>