ఆదివారం 25 అక్టోబర్ 2020
Telangana - Oct 16, 2020 , 02:09:43

భార్యను నరికి..

భార్యను నరికి..

  • ప్రియుడిగా అనుమానిస్తున్న వ్యక్తి ఇంటి ముందు తల

నారాయణఖేడ్‌: ఓ కిరాతకుడు తన భార్య ను అత్యంత దారుణంగా హతమార్చాడు. తల, మొండెం వేర్వేరు ప్రదేశాల్లో పడేశా డు. ప్రియుడిగా అనుమానిస్తున్న వ్యక్తి ఇం టి ముందు తలను ఉంచాడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకున్నది. పోలీసుల కథనం ప్రకారం.. నారాయణఖేడ్‌ మండలం అనంతసాగర్‌కు చెందిన సాయి లు, అనసూయ(42) దంపతులు. సాయి లు హైదరాబాద్‌లో జ్యూస్‌ సెంటర్‌ నిర్వహిస్తూ కుటుంబంతో సహా అక్కడే నివసిస్తున్నాడు. లాక్‌డౌన్‌ సమయంలో కుటుంబం తో సహా తిరిగి స్వగ్రామానికి వచ్చాడు. అనసూయకు నారాయణఖేడ్‌కు చెందిన మరో వ్యక్తితో వివాహేతర సంబంధం ఉన్నట్లు భర్త అనుమానిస్తున్నాడు. 

ఈ క్రమంలో సాయిలు బుధవారం రాత్రి తన భార్యను గొడ్డలితో నరికిచంపాడు. అనసూయ తల ను వేరు చేసి ఆమె ప్రియుడిగా భావిస్తున్న నారాయణఖేడ్‌ సాయిబాబా కాలనీలోని అతని ఇంటి గుమ్మం వద్ద ఉంచాడు. గురువారం ఉదయం అనంతసాగర్‌లోని ఓ ఖాళీ ప్రదేశంలో మహిళ మొండెం పడి ఉం డటాన్ని, నారాయణఖేడ్‌లో తల ఉండటా న్ని గుర్తించిన పోలీసులు అనంతసాగర్‌ గ్రామానికి వెళ్లి విచారణ జరిపారు. సాయి లు ప్రస్తుతానికి పరారీలో ఉన్నాడని, లొంగిపోయే అవకాశం ఉన్నట్లు డీఎస్పీ సత్యనారాయణరాజు తెలిపారు. 


logo