మంగళవారం 04 ఆగస్టు 2020
Telangana - Jul 06, 2020 , 02:13:17

లాలునాయక్‌ కుటుంబాన్ని ఆదుకుంటాం

లాలునాయక్‌ కుటుంబాన్ని ఆదుకుంటాం

  • మండలి చైర్మన్‌ గుత్తా, మంత్రి జగదీశ్‌రెడ్డి భరోసా
  • హత్యకు గురైన టీఆర్‌ఎస్‌ నేత కుటుంబానికి పరామర్శ

చందంపేట: కాంగ్రెస్‌ కార్యకర్తల చేతిలో శనివారం దారుణ హత్యకు గురైన నల్లగొండ జిల్లా చందంపేట జెడ్పీటీసీ సభ్యులు పవిత్ర తండ్రి, రైతు సమన్వయ సమితి మండల కోఆర్డినేటర్‌ రమావత్‌ లాలు నాయక్‌ కుటుంబాన్ని అన్నివిధాలా ఆదుకుంటామని మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, విద్యుత్‌ మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నా రు. ఆదివారం చందంపేట మండలంలోని బిల్డింగ్‌ తండా కు చేరుకున్న వారు లాలు నాయక్‌ భౌతికకాయం వద్ద నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చారు. హత్యకు పాల్పడిన వారికి కఠిన శిక్షపడేలా చొరవ తీసుకుంటామని బాధిత కుటుంబానికి భరోసా ఇచ్చారు. టీఆర్‌ఎస్‌ కూడా అండగా ఉంటుందన్నారు. వీరి వెంట జెడ్పీ చైర్మన్‌ బండా నరేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే రమావత్‌ రవీంద్రకుమార్‌ ఉన్నారు.


logo