బుధవారం 27 జనవరి 2021
Telangana - Jan 04, 2021 , 10:54:17

తెలంగాణ‌లో కొత్త‌గా 238 కరోనా కేసులు న‌మోదు

తెలంగాణ‌లో కొత్త‌గా 238 కరోనా కేసులు న‌మోదు

హైద‌రాబాద్ : తెలంగాణ‌లో కొత్త‌గా 238 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదైన‌ట్లు రాష్ర్ట వైద్యారోగ్య వెల్ల‌డించింది. గ‌డిచిన 24 గంట‌ల్లో 518 మంది క‌రోనా నుంచి కోలుకుని డిశ్చార్జి కాగా, ఇద్ద‌రు మృతి చెందారు. ఇప్ప‌టి వ‌ర‌కు తెలంగాణ‌లో 2,87,740 పాజిటివ్ కేసులు న‌మోదు కాగా, 5,106 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. క‌రోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 2,81,083. మొత్తం మ‌ర‌ణాల సంఖ్య 1,551. రాష్ర్టంలో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు త‌గ్గుముఖం ప‌డుతోంది. తెలంగాణ‌లో క‌రోనా సెకండ్ వేవ్ లేద‌ని వైద్యారోగ్య శాఖ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే.


logo