శనివారం 11 జూలై 2020
Telangana - Jul 01, 2020 , 02:44:09

మూడంచెల్లో నిధుల విధానంపై హర్షం

మూడంచెల్లో నిధుల విధానంపై హర్షం

  • సీఎం కేసీఆర్‌ సూచనతో స్థానికసంస్థలకు 15వ ఆర్థిక సంఘం నిధుల విభజన 
  • సీఎం, మంత్రులకు ఎమ్మెల్సీ పోచంపల్లి కృతజ్ఞత

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: స్థానిక సంస్థలకు మూడంచెల విధానంలో 15వ ఆర్థికసంఘం నిధులను కేటాయించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడంతో సీఎం కేసీఆర్‌ కృషి ఫలించిందని ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి హర్షం వ్యక్తంచేశారు. గతంలో వందశాతం పంచాయతీలకే నిధులు కేటాయించేవారని, సీఎం కేసీఆర్‌ సూచనమేరకు 85 శాతం నిధులను పంచాయతీలకు, 10 శాతం మండల పరిషత్‌లకు, ఐదుశాతం జిల్లా పరిషత్‌లకు కేటాయించారని చెప్పారు. మంగళవారం హైదరాబాద్‌లో మంత్రి ఎర్రబెల్లిని ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, జీహెచ్‌ఎంసీ మేయర్‌ బొంతు రామ్మోహన్‌ కలిశారు. 

మూడంచెల విధానం కోసం కృషిచేసిన సీఎం కేసీఆర్‌కు, మంత్రులు ఎర్రబెల్లి , కేటీఆర్‌కు పోచంపల్లి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ..పంచాయతీరాజ్‌ వ్యవస్థకు అత్యంత ప్రాధాన్యం ఉన్నదని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థలకు పల్లెప్రగతి, పట్టణప్రగతి కార్యక్రమాల కోసం నిధులు విడుదల చేస్తున్నదని గుర్తుచేశారు. 15వ ఆర్థిక సంఘం నిధులు గ్రామాల సర్వతోముఖాభివృద్ధికి దోహదపడుతాయన్నారు.


logo