మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Telangana - Sep 04, 2020 , 16:31:02

హైద‌రాబాద్‌లో దొంగ అరెస్ట్‌.. 12 తులాల బంగారం స్వాధీనం

హైద‌రాబాద్‌లో దొంగ అరెస్ట్‌.. 12 తులాల బంగారం స్వాధీనం

హైదరాబాద్ : న‌గ‌రంలో చోరీలకు పాల్పడుతున్న ఓ యువకుడిని బంజారాహిల్స్ పోలీసులు శుక్ర‌వారం అరెస్టు చేశారు. నిందితుడి నుంచి 12.5 తులాల బంగారం, 40 తులాల వెండి ఆభరణాల‌ను స్వాధీనం చేసుకున్న‌ట్లు పోలీసులు తెలిపారు. నిందితుడిని ఒడిశాకు చెందిన ఉమాశంక‌ర్‌(24)గా పోలీసులు గుర్తించారు. ఉపాధి నిమిత్తం హైద‌రాబాద్ చేరుకున్న ఉమాశంక‌ర్ కొన్నాళ్లు దిన‌స‌రి కూలీగా ప‌ని చేశాడు. కొన్ని సీరియ‌ల్స్‌లో ఆర్టిస్టుగా ప‌ని చేస్తూ జీవ‌నం సాగించాడు. ఇటీవ‌లి కాలంలో ఉపాధి దొర‌క్క‌పోవ‌డంతో దొంగ‌త‌నాల బాట ప‌ట్టాడు. తాళం వేసిన ఇళ్ల‌ను టార్గెట్ చేసి.. బంగారం, వెండితో పాటు విలువైన వ‌స్తువుల‌ను దొంగిలించిన‌ట్లు పోలీసులు పేర్కొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo