శనివారం 04 జూలై 2020
Telangana - Jun 16, 2020 , 15:32:58

బీబీపూర్ తండాలో ఇంటింటి సర్వే

బీబీపూర్ తండాలో ఇంటింటి సర్వే

నిజామాబాద్ : నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్ కు కరోనా పాజిటివ్ వచ్చిన విషయం తెలిసిందే. అయితే అంతకు ముందు శనివారం ఎమ్మెల్యే డిచ్ పల్లి మండలం బీబీపూర్ తండాలో డబుల్ బెడ్ రూం ఇండ్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా తండాలో అధికారులు ఇంటింటి సర్వే నిర్వహించారు. ఐదుగురు ప్రైమరీ కాంటాక్ట్స్ ను గుర్తించి వారిని వైద్యాధికారులు హోం క్వారంటైన్ చేశారు. ప్రజలు ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.


logo