ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Telangana - Sep 12, 2020 , 18:46:58

పుట్టిన రోజు సంద‌ర్భంగా జూలో పులిని ద‌త్త‌త తీసుకున్న విద్యార్థి

పుట్టిన రోజు సంద‌ర్భంగా జూలో పులిని ద‌త్త‌త తీసుకున్న విద్యార్థి

హైదరాబాద్ : 12 ఏండ్ల విద్యార్థి తన పుట్టినరోజు సంద‌ర్భంగా నెహ్రూ జూలాజికల్ పార్క్ (ఎన్‌జెడ్పీ)లో మూడు నెలల పులిని దత్తత తీసుకున్నాడు. 7వ తరగతి చ‌దువుతున్న చిన్మ‌య్ సిద్ధార్థ్ షా..  “సంకల్ప్” అనే రాయల్ బెంగాల్ టైగ‌ర్‌ను ద‌త్త‌త తీసుకోవ‌డానికి త‌న తండ్రి స‌హ‌కారంతో మూడు నెలల కాలానికి రూ.25వేల చెక్కును డిప్యూటీ క్యూరేటర్ ఎ.నాగమణికి అందజేశాడు. 

అంతే కాకుండా మ‌రో ఐదుగురు విద్యార్థులు కూడా ఇత‌ర జంతువులు, చిన్న పక్షులను దత్తత తీసుకోవడానికి ముందుకు వ‌చ్చి ఒక్కొక్క‌రూ రూ.5వేల చెక్కును అంద‌జేశారు. జంతువుల‌పై త‌మ‌కున్న ప్రేమ‌ను చాటినందుకు గాను చిన్నారుల‌కు జూ అధికారి నాగమణి కృతజ్ఞతలు తెలిపారు. వీరిని ఆద‌ర్శంగా తీసుకొని ఎక్కువ మంది ముందుకు వ‌చ్చి జంతువులను దత్తత తీసుకోవాలని ఆమె కోరారు. మార్చి 22 నుంచి సందర్శకుల ప్రవేశాన్ని నిషేధించడం వల్ల జూ.. రూ.6 కోట్లకు పైగా నష్టాన్ని చవిచూసింద‌ని ఆమె పేర్కొన్నారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo