మంగళవారం 11 ఆగస్టు 2020
Telangana - Jul 05, 2020 , 17:18:49

స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు

స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు

హైదరాబాద్‌ : మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. నేడు హైదరాబాద్‌, విశాఖపట్నం, విజయవాడ మార్కెట్లలో రూ.50 మేర బంగారం ధర తగ్గింది. దీంతో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.50,850కి చేరింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.46,240 వద్ద నిలిచింది.

వెండి 1 కేజీపై రూ.40 తగ్గింది. దీంతో 1 కేజీ వెండి ధర రూ.48,510కి చేరింది. ఢిల్లీలో మార్కెట్‌లోనూ బంగారం ధర రూ.50 తగ్గి 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.48,320, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.47,120కి చేరింది.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డోన్లోడ్ చేసుకోండి.


logo