బుధవారం 27 మే 2020
Telangana - May 08, 2020 , 06:37:30

అటవీ ఉత్పత్తుల ధరల్లో స్వల్ప పెంపు

అటవీ ఉత్పత్తుల ధరల్లో స్వల్ప పెంపు

హైదరాబాద్‌ : గిరిజనుల ఆర్థికాభివృద్ధి కోసం కేంద్ర మార్గదర్శకాల ప్రకారం అటవీ ఉత్పత్తుల ధరలను స్వల్పంగా పెంచినట్టు గిరిజన సంక్షేమశాఖ కమిషనర్‌, కార్యదర్శి క్రిస్టినా జడ్‌ చోంగ్తు తెలిపారు. కిలో అడవి తేనె ధర రూ.195 ఉండగా ప్రస్తుతం రూ.225కు పెంచామని చెప్పారు. కిలో ఇప్పపువ్వును రూ.17నుంచి రూ.30కి, కిలో బంక (గమ్‌) రూ.108 నుంచి రూ.114కి, కిలో ఇప్ప విత్తనాలను రూ.25నుంచి రూ.29కి, కిలో ఎండబెట్టిన ఉసిరి గుజ్జు రూ.45 నుంచి రూ.52కి, కిలో మార్కింగ్‌ నట్స్‌ను రూ.9 నుంచి రూ.12కి, కిలో సోప్‌నట్స్‌ ధరను రూ.8 నుంచి రూ.14కు పెంచినట్టు పేర్కొన్నారు.


logo