సోమవారం 01 జూన్ 2020
Telangana - May 20, 2020 , 01:08:37

గల్ఫ్‌ బాధితుడికి చేయూత

గల్ఫ్‌ బాధితుడికి చేయూత

  • మాజీ ఎంపీ కవిత చొరవతో వ్యక్తికి చికిత్స

నిజామాబాద్‌, నమస్తే తెలంగాణ: తీవ్ర అనారోగ్యంతో గల్ఫ్‌ నుంచి హైదరాబాద్‌కు చేరుకొన్న ఓ వ్యక్తి మెరుగైన చికిత్సకు మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత ఏర్పాట్లు చేయించారు. నిజామాబాద్‌ జిల్లా భీమ్‌గల్‌ మండలం పల్లికొండకు చెంది న దొనుపాల రవీందర్‌ కొన్నేండ్ల క్రితం మస్కట్‌ వెళ్లాడు. ఇటీవల రవీందర్‌ తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. అతని సహచరులు ఇండియన్‌ ఎంబసీకి సమాచారం ఇవ్వగా.. రవీందర్‌ను హైదరాబాద్‌కు పంపించే ఏర్పాట్లు చేశారు. కాగా, సోమవారం రాత్రి రవీందర్‌ శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నాడు. 

నిరుపేద కుటుంబానికి చెందిన రవీందర్‌కు సాయం చేయాలని అతని కుటుంబ సభ్యులు మాజీ ఎంపీ కవితను అభ్యర్థించారు. స్పందించిన కవిత రవీందర్‌ చికిత్సకు అవసరమైన సాయం చేయాలని తెలంగాణ జాగృ తి నాయకులను ఆదేశించారు. ఈ మేరకు ఎయిర్‌పోర్టుకు చేరుకున్న జాగృతి నాయకులు నవీన్‌ ఆచారి.. రవీందర్‌ను ఉస్మానియా దవాఖానకు తరలించి, దగ్గరుండి చికిత్స చేయించారు. అడిగిన వెంటనే స్పందించిన మాజీ ఎంపీ కవితకు రవీందర్‌ కుటుంబసభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.


logo