ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Telangana - Jan 17, 2021 , 01:47:11

అడాల్‌పూర్‌ అడవిలో బుల్లెట్‌ కలకలం

అడాల్‌పూర్‌ అడవిలో బుల్లెట్‌ కలకలం

తాండూరు, జనవరి 16: వికారాబాద్‌ జిల్లా యాలాల మండలం అడాల్‌పూర్‌ అటవీ ప్రాంతంలో ఓ పశువుల కాపరికి తుపాకీ బుల్లెట్‌తోపాటు మ్యాగ్జిన్‌ లభించడం కలకలం రేపుతున్నది. ఆ కాపరి వాటిని సర్పంచ్‌కు అప్పగించడంతో ఆయన అటవీ అధికారులకు చూపించి పోలీసులకు అందజేశారు. పదిరోజుల క్రితం జరిగిన ఈ ఘటనను పోలీసులు గోప్యంగా ఉంచినప్పటికీ శనివారం విషయం బయటకు పొక్కింది. ఎవరైనా అడవిలో వేటకు వస్తే అక్కడ పడిపోయాయా..? లేదా ఇతర కారణం ఏమైనా ఉందా? అనే తెలియాల్సి ఉన్నది. తాండూరుకు చెందిన కొందరు వ్యక్తులు తరచూ వేట కోసం అటవీ ప్రాంతానికి వస్తుంటారని ప్రచారం జరుగుతుంది. ఇదే విషయమై రూరల్‌ సీఐ జలంధర్‌రెడ్డిని ప్రశ్నిస్తే.. బుల్లెట్‌, మ్యాగ్జిన్‌ దొరికిన విషయం వాస్తవమేనన్నారు. ఇది ఎవరిది?, ఎందుకు అక్కడ పడింది అనే విషయమై దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. 

VIDEOS

logo