మంగళవారం 07 జూలై 2020
Telangana - Jun 25, 2020 , 20:00:53

గ‌వ‌ర్న‌మెంట్ పాలిటెక్నిక్ కాలేజీలో క‌రోనా క‌ల‌క‌లం

గ‌వ‌ర్న‌మెంట్ పాలిటెక్నిక్ కాలేజీలో క‌రోనా క‌ల‌క‌లం

హైద‌రాబాద్ : రాష్ర్ట రాజ‌ధాని హైద‌రాబాద్ లో క‌రోనా వైర‌స్ చాప‌కింద నీరులా విస్త‌రిస్తూనే ఉంది. రోజురోజుకు న‌గ‌రంలో క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు అవుతున్నాయి. సికింద్రాబాద్ ఈస్ట్ మారేడ్ ప‌ల్లిలోని గ‌వ‌ర్నమెంట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎల‌క్ర్టానిక్స్ కాలేజీ(పాలిటెక్నిక్ కాలేజీ)లో క‌రోనా వైర‌స్ క‌ల‌క‌లం రేపింది. 

ఆ కాలేజీలో ప‌ని చేసే సీనియ‌ర్ అసిస్టెంట్ సుధాక‌ర్ కు క‌రోనా పాజిటివ్ నిర్ధార‌ణ అయింది. ఈ మేర‌కు ప్ర‌భుత్వ కింగ్ కోఠి ఆస్ప‌త్రి వైద్యులు ధృవీక‌రించారు. సుధాక‌ర్ ను 14 రోజుల పాటు హోం క్వారంటైన్ లో ఉండాల‌ని వైద్యులు సూచించారు. కొవిడ్ నిబంధ‌న‌ల‌ను త‌ప్ప‌నిస‌రిగా పాటించాల‌ని ఆయ‌న‌ను డాక్ట‌ర్లు ఆదేశించారు. 

పాలిటెక్నిక్ కాలేజీలో క‌రోనా క‌ల‌క‌లంతో.. మిగ‌తా ఉద్యోగులు తీవ్ర ఆందోళ‌న‌కు గుర‌వుతున్నారు. ప్ర‌స్తుతానికి నాన్ టీచింగ్ సిబ్బంది మాత్ర‌మే విధులకు హాజ‌ర‌వుతున్నారు. అయితే మిగ‌తా ఉద్యోగులంద‌రూ ఇంటి నుంచి ప‌ని చేయాల‌ని కాలేజీ యంత్రాంగం సూచించింది. 


logo