బుధవారం 08 ఏప్రిల్ 2020
Telangana - Mar 07, 2020 , 01:01:32

బాలికలపై ప్రైవేట్‌ టీచర్‌ లైంగికదాడి

బాలికలపై ప్రైవేట్‌ టీచర్‌ లైంగికదాడి

వనపర్తి టౌన్‌: పాఠాలు చెప్పాల్సిన ప్రైవేట్‌ పా ఠశాల టీచర్‌ బాలికలపై లైంగికదాడి చేసి కటకటాలపాలయ్యాడు. వనపర్తి డీఎస్పీ కిరణ్‌కుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం.. వనపర్తి జిల్లా గోపాల్‌పేట మండలంలోని ఓ గ్రామంలోని ప్రైవేటు పాఠశాలలో   నాగర్‌కర్నూల్‌ జిల్లా తెల్కపల్లి మండలం పెద్దూరుకు చెందిన సామ శరత్‌కుమార్‌ 2016 నుంచి ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. బంధువుల ఇంట్లో ఉంటూ 4, 5 తరగతుల విద్యార్థులకు గురుకుల కోచింగ్‌ ఇస్తున్నాడు. సం దేహాలు నివృత్తి చేస్తానంటూ కోచింగ్‌ అనంతరం ఇంటికి పిలిపించుకొని రేండేండ్లుగా అమ్మాయిలపై లైంగికదాడి చేస్తున్నాడు. గు రువారం ఓ బాలికకు రక్తస్రావం కావడాన్ని గుర్తించిన ఆమె తల్లి ఆరాతీసింది.  ఉపాధ్యాయుడు చేసిన అకృత్యాన్ని బాలిక తల్లికి చెప్పింది. తనతోపాటు మరో అమ్మాయిపై కూడా లైంగికదాడికి పాల్పడ్డాడని చెప్పింది. దీంతో బాలికల తల్లిదండ్రులు, గ్రామస్థులు పాఠశాలకు వెళ్లి నిందితుడి గురించి యాజమాన్యాన్ని ప్రశ్నించారు. అతను ఓపెన్‌ డిగ్రీ పరీక్షలు రాస్తున్నాడని చెప్పడంతో.. కొల్లాపూర్‌కు వెళ్లి పట్టుకొచ్చి దేహశుద్ధి చేసి గోపాల్‌పేట పోలీసులకు అప్పగించారు. బాలికల బంధువుల ఫిర్యాదు మేరకు నిందితుడిపై 132,133, 376 సెక్షన్లు, పోక్సో కేసు నమోదు చేసి, రిమాండ్‌కు తరలించారు.  
logo