మంగళవారం 07 జూలై 2020
Telangana - Jun 11, 2020 , 11:59:31

బొట్టు బొట్టును ఒడిసి పడుతూ..భూగర్భ జలాలను పెంపొందిస్తూ

బొట్టు బొట్టును ఒడిసి పడుతూ..భూగర్భ జలాలను పెంపొందిస్తూ

వికారాబాద్ : భూగర్భ జలాల పెంపునకు చెక్ డ్యామ్లు దోహదం చేస్తాయి. వర్షపు నీరు వృథా కాకుండా తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ అపర భగీరథ ప్రయత్నం చేస్తున్నారని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. జిల్లాలోని ధారూర్ మండలం డోర్నాల గ్రామంలో మెథడిస్టు చర్చి సమీపంలో రెండు కోట్ల30 లక్షల 50 వేల రూపాయల నిధులతో నిర్మించనున్న చెక్ డ్యామ్, కోటి 61 లక్షల 50 వేల రూపాయలతో మరో చెక్ డ్యామ్ నిర్మాణ పనులకు ఎమ్మెల్యేలు డాక్టర్ మెతుకు ఆనంద్, పైలట్ రోహిత్ రెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. 

అనంతరం మంత్రి మాట్లాడుతూ.. జిల్లాలో రూ.72 కోట్లతో చెక్ డ్యామ్ ల నిర్మాణం పనులు చేపడుతున్నట్లు తెలిపారు. ప్రతి నీటి బొట్టును ఒడిసి పట్టే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంది. అలాగే లాక్ డౌన్ నేపథ్యంలో రోజు వారి పనులు చేసుకునే వారితో పాటు చాలా మందికి వచ్చిన ఇబ్బందుల దృష్ట్యా సడలింపు ఇచ్చారు. ఈ వెసులుబాటును అవకాశంగా తీసుకొని  నిర్లక్ష్యం చేయొద్దు. కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తెలంగాణలో రైతు ప్రభుత్వం నడుస్తున్నదని, ప్రతి రైతును రాజును చేసే లక్ష్యంతో ముందుకెళ్తుందని మంత్రి పేర్కొన్నారు.


logo