శనివారం 15 ఆగస్టు 2020
Telangana - Jul 15, 2020 , 16:25:03

యువకుడి ప్రాణం నిలబెట్టిన మాజీ ఎంపీ కవిత

యువకుడి ప్రాణం నిలబెట్టిన మాజీ ఎంపీ కవిత

హైదరాబాద్‌ : ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడంలో మందుంటానని మరోసారి నిరూపించారు నిజామాబాద్‌ మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత. రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ యువకుడికి వైద్యం అందించేందుకు డబ్బులు లేక ఇబ్బంది పడుతుండగా అండగా నిలిచి ప్రాణాన్ని నిలబెట్టారు. వివరాల్లోకి నిజామాబాద్‌ జిల్లా ఇందల్‌వాయికి చెందిన అజయ్‌ సోమవారం రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. త్రీవ గాయాలు కావడంతో మెరుగైన చికిత్స అందిచాలని వైద్యులు సూచించారు. నిరుపేద కుటుంబం కావడంతో స్నేహితులు తలాకొంత డబ్బులు పోగు చేశారు. అయినా అవి సరిపోకపోవడంతో ట్విట్టర్‌ ద్వారా మాజీ ఎంపీ కవితను సహాయం కోరారు.

వెంటనే ఆమె స్పందించి హైదరాబాద్‌ నిమ్స్‌లో వైద్య సేవలందేలా ఏర్పాట్లు చేశారు. అజయ్‌ని అర్ధరాత్ని దవాఖానలో చేర్పించగా, ప్రస్తుతం అతని పరిస్థితి మెరుగ్గా ఉందని వైద్యులు తెలిపారు. అజయ్‌ని వైద్యులు డిశ్చార్జి చేయగా.. స్వగ్రామానికి బయలుదేరి వెళ్లారు. ఎంపీ కవిత ఆదేశాల మేరకు తెలంగాణ జాగృతి బాధ్యుతలు మూడు నెలలకు కావాల్సిన మందుల కోసం రూ.23వేలు అందజేశారు. అలాగే ఇంకా ఏవైనా వైద్యం అవసరమైతే సహాయం అందజేస్తామని ఆ కుటుంబానికి భరోసా ఇచ్చారు. అడిగిన వెంటనే సహాయం అందించిన కవితకు యువకుడి కుటుంబీకులు కృతజ్ఞతలు తెలిపారు.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.logo