శుక్రవారం 30 అక్టోబర్ 2020
Telangana - Sep 24, 2020 , 16:38:21

న‌కిలీ బంగారంతో బ్యాంకును మోసం చేసిన ప్ర‌బుద్ధుడు

న‌కిలీ బంగారంతో బ్యాంకును మోసం చేసిన ప్ర‌బుద్ధుడు

రంగారెడ్డి : ఓ ప్ర‌బుద్ధుడు న‌కిలీ బంగారంతో బ్యాంకు అధికారుల‌ను మోసం చేశాడు. ఈ ఘ‌ట‌న మ‌హేశ్వ‌రం మండ‌లం తుక్కుగూడ ఆంధ్రా బ్యాంకులో వెలుగు చూసింది. బ్యాంకు అధికారుల ఫిర్యాదు మేర‌కు పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు.  బ్యాంకును మోసం చేసిన వ్య‌క్తిని బ్యాంకులో బంగారం కొల‌త‌లు చూసుకునే వ్య‌క్తిగా పోలీసులు గుర్తించారు. నిందితుడు, అత‌డికి స‌హ‌క‌రించిన ఉద్యోగుల‌ను పోలీసులు ప్ర‌శ్నిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి మొత్తం ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. న‌కిలీ బంగారం తాక‌ట్టు పెట్టి.. గ‌త నాలుగు సంవ‌త్స‌రాల నుంచి రెండున్న‌ర కోట్ల వ‌ర‌కు లోన్ తీసుకున్న‌ట్లు విచార‌ణ‌లో వెల్ల‌డైంది.