గురువారం 25 ఫిబ్రవరి 2021
Telangana - Jan 22, 2021 , 13:11:32

మిస్సింగ్ కేసుల‌ను చేధించ‌డ‌మే ల‌క్ష్యం : ఎస్పీ రంగ‌నాథ్‌

మిస్సింగ్ కేసుల‌ను చేధించ‌డ‌మే ల‌క్ష్యం : ఎస్పీ రంగ‌నాథ్‌

న‌ల్ల‌గొండ : జిల్లాలో న‌మోదైన మిస్సింగ్ కేసుల‌ను చేధించ‌డ‌మే ల‌క్ష్యంగా ముందుకెళ్తున్నామ‌ని ఎస్పీ, డీఐజీ ఏవీ రంగ‌నాథ్ స్ప‌ష్టం చేశారు. ఈ క్ర‌మంలోనే యాంటీ హ్యుమ‌న్ ట్రాఫికింగ్ బృందాన్ని ఏర్పాటు చేశామ‌ని, ఆ బృందం స‌మ‌ర్థ‌వంతంగా ప‌ని చేస్తుంద‌ని ఆయ‌న తెలిపారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఐదు మిస్సింగ్ కేసుల‌ను చేధించిన‌ట్లు పేర్కొన్నారు. 2016 సంవ‌త్స‌రంలో న‌ల్ల‌గొండ జిల్లా మిర్యాల‌గూడ బాపూజీన‌గ‌ర్‌కు చెందిన వ‌డ్ల‌ప‌ల్లి నాగభార‌తి అదృశ్యం కాగా, ఇటీవ‌లే ఆమెను గుర్తించి కుటుంబ స‌భ్యుల‌కు అప్ప‌గించారు. నాగ‌భార‌తి ఇంట్లో ఎవ‌రికి చెప్ప‌కుండా న‌గ‌రంలోని జ‌గ‌ద్గిరిగుట్ట‌కు వెళ్లింది. అక్క‌డే ప్ర‌యివేటు ఉద్యోగం చేస్తూ జీవ‌నం కొన‌సాగిస్తోంది. త‌ల్లి ఫిర్యాదు మేర‌కు కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు.. ఆధునిక టెక్నాల‌జీతో ఆమె ఆచూకీని కనుగొని శుక్ర‌వారం కుటుంబ స‌భ్యుల‌కు అప్ప‌గించిన‌ట్లు ఎస్పీ తెలిపారు.    

మిస్సింగ్ కేసుల‌ను చేధించ‌డంలో కీల‌కంగా ప‌ని చేస్తున్న సీఐ స‌త్యం, ఎస్ఐలు రాంబాబు, నాగుల్ మీరా, కానిస్టేబుల్స్ న‌ర్సింహా, మ‌ధు, న‌జీర్‌, బాల‌య్య‌, సాయి సందీప్‌ల‌ను ఎస్పీ రంగ‌నాథ్ ప్ర‌త్యేకంగా అభినందించారు. జిల్లాలో ఉన్న అన్ని మిస్సింగ్ కేసుల‌ను వీలైనంత త్వ‌ర‌గా చేధిస్తామ‌ని ఎస్పీ స్ప‌ష్టం చేశారు. 

VIDEOS

logo