బుధవారం 25 నవంబర్ 2020
Telangana - Nov 05, 2020 , 12:32:55

గ‌చ్చిబౌలిలో మంగళ సూత్రాన్ని పోగొట్టుకున్నారా..?

గ‌చ్చిబౌలిలో మంగళ సూత్రాన్ని పోగొట్టుకున్నారా..?

హైద‌రాబాద్ : ఎవరైనా రోడ్డుపై మంగళ సూత్రాన్ని పోగొట్టుకున్నారా.. అయితే గచ్చిబౌలి ట్రాఫిక్‌ పోలీసులను సంప్రదించండి. కొండాపూర్‌ వద్ద ట్రాఫిక్‌ విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి ఇటీవల రోడ్డుపై మంగళ సూత్రం దొరికింది. ఆ దారిన పోయిన వారు పోగొట్టుకున్న వారు ఉంటే.. వెంటనే గచ్చిబౌలి ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌ -9490617479కు సంప్రదించాలని పోలీసు అధికారులు కోరుతున్నారు.