శనివారం 04 ఏప్రిల్ 2020
Telangana - Mar 14, 2020 , 07:19:34

మందలించినందుకే.. గొంతుకోశాడు

మందలించినందుకే.. గొంతుకోశాడు

హైదరాబాద్ : భార్య పట్ల అసభ్యకంగా ప్రవర్తిస్తున్నాడని మందలించిన పాపానికి.. గొంతుకోసి హత్య చేశాడు. ఈ సంఘటన ఎస్‌ఆర్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గుల్బర్గాకు చెందిన షేక్‌ మోసిన్‌(35) అలియాస్‌ గౌస్‌, దివ్య దంపతులు బేగంపేట మసీదు ప్రాంతంలో నివాసముంటూ.. రోడ్లపై చిత్తు కాగితాలు ఏరుకుంటూ జీవిస్తున్నారు. షేక్‌ మోసిన్‌కు.. వీరితో పనిచేసే బోరబండకు చెందిన అబ్బు షేక్‌ స్నేహితుడు. 

కాగా.. గురువారం అర్ధరాత్రి పనులు పూర్తయిన తరువాత ఆ ముగ్గురు అమీర్‌పేట్‌ గ్రీన్‌పార్కు హోటల్‌ సమీపంలోని రోడ్డుపై కూర్చుని  మద్యం తాగారు. అక్కడే ఫుట్‌పాత్‌పై పడుకున్నారు. ఈ క్రమంలో అబ్బు షేక్‌.. దివ్య పట్ల అసభ్యంగా ప్రవర్తించసాగాడు. గమనించిన మోసిన్‌.. ఇదేం పని అంటూ స్నేహితుడిని మందలించాడు. దీంతో అబ్బు షేక్‌.. మోసిన్‌తో గొడవకు దిగి.. పదునైన వస్తువుతో గొంతు కోసి అక్కడి నుంచి పరారయ్యాడు. తీవ్ర గాయాల పాలైన మోసిన్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని గాంధీ మార్చురీకి తరలించారు. మృతుడి భార్య దివ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


logo