బుధవారం 03 జూన్ 2020
Telangana - Mar 29, 2020 , 21:49:04

జంతు ప్రేమికుడి ఔదార్యం

జంతు ప్రేమికుడి ఔదార్యం

హైదరాబాద్ : లాక్ డౌన్ కారణంగా హైదరాబాద్ నగరంలోని మూగజీవాలు ఆకలితో అలమటిస్తున్నాయి. ఆ పరిస్థితిని సికింద్రాబాద్ కు చెందిన శశాంక్ అనే యువకుడు గమనించి వాటికి ఆహారం అందిస్తున్నాడు.  ఉదయం, సాయంత్రం జంట నగరాల్లో పలు చోట్ల ఉండే పక్షుల కడుపు నింపుతున్నాడు శశాంక్. గతంలో ఆరుబయట కనిపించే పక్షులకు  ఆహార ధాన్యాలు  అందించేవారు. ప్రస్తుతం పరిస్థితి మారింది. లాక్ డౌన్ కారణంగా జనాలు ఇండ్లకే పరిమితం అయ్యారు.  పలు వీధుల్లో ఉండే శునకాలు సైతం  తిండి దొరక్క నానా ఇబ్బందులు పడుతున్నాయి. అటువంటి మూగజీవాలకు కడుపునింపే పనిలో నిమగ్నమయ్యాడు పసుపులేటి శశాంక్. జంట నగరాల్లో ఆకలితో అలమటిస్తున్న వందలాది పక్షులు,శునకాలకు లాక్ డౌన్ అమలు లో ఉన్నన్ని రోజులూ ఆహారం అందిస్తా నంటున్నాడీ జంతు ప్రేమికుడు.


logo