శుక్రవారం 05 జూన్ 2020
Telangana - Apr 30, 2020 , 14:34:51

నన్నే ఆపుతారా.. బాంబు పెట్టి లేపేస్తా.. పోలీసులపై హల్‌చల్‌.. వీడియో

నన్నే ఆపుతారా.. బాంబు పెట్టి లేపేస్తా.. పోలీసులపై హల్‌చల్‌.. వీడియో

హైదరాబాద్‌ : నన్నే ఆపుతారా.. ఏమనుకుంటున్నారు.. నేనేవర్నో తెలుసా.. బాంబు పెట్టి లేపేస్తా అని అరుస్తూ ఓ వ్యక్తి పోలీసులపై హల్‌చల్‌ చేశాడు. అసభ్యకరమైన పదజాలంతో పోలీసులను దూషిస్తూ.. వారిపై చేయి చేసుకున్నాడు. ఈ సంఘటన లంగర్‌హౌస్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలోని టిప్పుఖాన్‌ బ్రిడ్జి వద్ద గురువారం ఉదయం చోటు చేసుకుంది. హిమాయత్‌సాగర్‌కు చెందిన వ్యక్తి లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించి బైక్‌పై వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో సదరు వ్యక్తి పోలీసులను బెదిరించాడు. అసభ్య పదజాలంతో దూషించాడు. పోలీసులపై చేయి చేసుకుని.. పోలీసు మూతికున్న మాస్కును లాగేశాడు ఆ వ్యక్తి. చివరకు పోలీసులు అతన్ని స్టేషన్‌కు తరలించి విచారించారు. 

పోలీసులపై హల్‌చల్‌ చేసిన అతను మానసిక రోగి అని పోలీసుల విచారణలో తేలింది. రెండు నెలల క్రితమే ఎర్రగడ్డ మానసిక వైద్యశాల నుంచి డిశ్చార్జి అయినట్లు తెలిసింది. సంవత్సరం క్రితం తన భార్య చనిపోవడంతో పిచ్చోడిలా ప్రవర్తిస్తున్నాడు. గత రెండు రోజుల నుంచి తన భార్యకు గుర్తుకు రావడంతో.. పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తున్నాడని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. మొత్తానికి అతన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు పోలీసులు. logo