బుధవారం 03 జూన్ 2020
Telangana - May 15, 2020 , 10:07:18

అదుపుతప్పిన బైక్‌.. చిన్నారి మృతి

అదుపుతప్పిన బైక్‌.. చిన్నారి మృతి

యాదాద్రి భువనగిరి : చౌటుప్పల్‌ మండలం బొర్రోళ్లగూడెం వద్ద ఘోరం జరిగింది. బైక్‌పై వెళ్తున్న ఓ కుటుంబం.. రోడ్డుప్రమాదానికి గురైంది. ఇద్దరు భార్యాభర్తలు.. తమ చిన్నారితో కలిసి హైదరాబాద్‌ నుంచి పశ్చిమ గోదావరి జిల్లాకు బైక్‌పై బయల్దేరారు. బొర్రోళ్లగూడెం వద్ద వీరు ప్రయాణిస్తున్న బైక్‌ అదుపుతప్పి కిందపడిపోయింది. ఈ ప్రమాదంలో చిన్నారి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. మహిళ తీవ్రంగా గాయపడింది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. మహిళను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. చిన్నారి మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. logo