శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Telangana - Mar 14, 2020 , 15:06:08

సీఎం అధ్యక్షతన కరోనాపై ఉన్నతస్థాయి కమిటీ సమావేశం

సీఎం అధ్యక్షతన కరోనాపై ఉన్నతస్థాయి కమిటీ సమావేశం

హైదరాబాద్‌ : కరోనాపై ఉన్నతస్థాయి కమిటీ సమావేశం ప్రారంభమైంది. సీఎం కేసీఆర్‌ అధ్యక్షత శాసనసభ కమిటీ హాల్‌లో సమావేశం జరుగుతుంది. భేటీలో మంత్రి ఈటల రాజేందర్, సీఎస్ సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కరోనాను నియంత్రించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై భేటీలో చర్చించనున్నారు. అదేవిధంగా ఇతర రాష్ర్టాల్లోని పరిస్థితులను కమిటీ సమీక్షించనుంది.

దూలపల్లి ఫారెస్ట్‌ అకాడమీలో ఐసోలేటెడ్‌ సెంటర్‌..

కరోనాపై ఇవాళ అత్యున్నత నిర్ణయం తీసుకుంటామని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ తెలిపారు. కరోనా విషయంలో ప్రభుత్వం అప్రమత్తంగా ఉందన్నారు. ప్రజలు కూడా ప్రభుత్వ సూచనలు పాటించాలని కోరారు. విదేశాల నుంచి వచ్చినవాళ్లు వెంటనే ఆస్పత్రుల్లో సంప్రదించాలని సూచించారు. ఎంత ఖర్చయినా ప్రజల ఆరోగ్యం కాపాడతామని మంత్రి పేర్కొన్నారు. మరోవైపు కరోనాను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం ముందుజాగ్రత్త చర్యలు చేపట్టింది. దూలపల్లి ఫారెస్ట్‌ అకాడమీలో ఐసోలేటెడ్‌ సెంటర్‌ను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంది. ఈ క్రమంలో భాగంగా మేడ్చల్‌ కలెక్టర్‌ వెంకటేశ్వర్లు, ఆర్డీవో మల్లయ్య ఏర్పాట్లను పరిశీలించారు.


logo