మంగళవారం 14 జూలై 2020
Telangana - Jun 06, 2020 , 03:32:15

అమరవీరుల స్తూపానికి ‘హరిత’ వందనం

అమరవీరుల స్తూపానికి ‘హరిత’ వందనం

  • పర్యావరణ హోదా సాధించిన గన్‌పార్కు గడ్డ
  • హైదరాబాద్‌ సిటీ పోలీస్‌ కమిషనరేట్‌ కూడా..

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలోని మరో రెండు కట్టడాలు ‘హరిత’ హోదా సాధించాయి. హైదరాబాద్‌లోని తెలంగాణ అమరవీరుల స్తూపం, సిటీ పోలీస్‌ కమిషనరేట్‌ ప్రధాన కార్యాలయాలను హరిత భవనాలుగా గుర్తిస్తూ ఇండియన్‌ గ్రీన్‌ బిల్డింగ్‌  కౌన్సిల్‌(ఐజీబీసీ) ఉత్తర్వులు జారీచేసింది. హరిత హోదా రావడం పట్ల రోడ్లు, భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి హర్షం వ్యక్తంచేశారు. ఇతర నిర్మాణాలతో పోల్చితే అమరవీరుల స్తూపం, సిటీ పోలీస్‌ కమిషనరేట్‌ భవనంలో ఇంధన వినియోగం 30-50 శాతం, నీటి వినియోగం 20-30 శాతం వరకు తక్కువగా ఉందన్నారు. 

ఆర్‌అండ్‌బీ శాఖ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ గణపతిరెడ్డి మాట్లాడుతూ.. సూర్యకాంతిని ఎక్కువగా వినియోగిస్తున్నామని, ఎల్‌ఈడీ లైట్ల వాడకం, ఇంకుడు గుంతలు, స్టోరేజీ ట్యాంకులు, బిందు, స్ప్రింక్లర్ల వ్యవస్థ ఏర్పాటు, మురుగునీటి నిర్వహణ, పునర్వినియోగం వంటివి అమలు చేసినట్టు తెలిపారు. కనీసం 15శాతం స్థలంలో పచ్చదనాన్ని పెంచినట్టు చెప్పారు. డీజీపీ మహేందర్‌ రెడ్డి మాట్లాడుతూ సిటీ కమిషనరేట్‌ భవన నిర్మాణాన్ని ప్రతిష్ఠాత్మకంగా, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మిస్తున్నామని అందుబాటులోకి వస్తుందని పేర్కొన్నారు.


logo