శుక్రవారం 29 మే 2020
Telangana - Apr 10, 2020 , 22:25:23

కరోనాపై అవగాహన.. ఉపాధ్యాయుని వినూత్న ప్రచారం

కరోనాపై అవగాహన.. ఉపాధ్యాయుని వినూత్న ప్రచారం

ఖమ్మం : జిల్లాలోని కల్లూరు మండల పరిధిలోని చెన్నూరుకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు వోలాఫ్‌ కైండ్‌నెస్‌ నిర్వాహకులు దంతాల సుధాకర్‌ స్వచ్ఛందంగా కరోనా వైరస్‌పై అవగాహన కల్పించేందుకు శుక్రవారం వినూత్న వేషధారణలో ప్రచారం మొదలుపెట్టాడు. కరోనా మహమ్మరి నుంచి ప్రజలకు అవగాహన కల్పించి ప్రతిఒక్కరూ ఇండ్లలోనే ఉండే విధంగా అవగాహన కల్పిస్తానన్నారు. మండలంలోని అన్ని గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పించేందుకు తనవంతు ప్రయత్నం చేస్తానన్నారు. 


logo