బుధవారం 23 సెప్టెంబర్ 2020
Telangana - Aug 27, 2020 , 15:14:43

కష్టకాలంలోనూ పేదలకు అండగా ఉంటున్న ప్రభుత్వం

కష్టకాలంలోనూ పేదలకు అండగా ఉంటున్న ప్రభుత్వం

సూర్యాపేట : కష్టకాలంలో రాష్ట్ర ప్రభుత్వం పేదలను ఆదుకునేందుకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులు పంపిణీ చేస్తోందని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి అన్నారు. సూర్యాపేట నియోజకవర్గ వ్యాప్తంగా లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులు పంపిణీ కి నిన్న శ్రీకారం చుట్టిన మంత్రి వరుసగా రెండో రోజు కూడా లబ్ధిదారులకు చెక్ లను పంపిణీ చేశారు.  పెన్ పహాడ్ కు సంబంధించి 191 చివ్వేంల మండలాలకు సంబంధించి 196  మంది లబ్ధ్దిదారులకు రూ.3.87 కోట్ల చెక్కులు అందజేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పేదలను అన్నిరంగాల్లో అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేస్తుందన్నారు. గతంలో నిరుపేదలు పెండ్లి చేయాలంటే అష్టకష్టాలు పడేవారని గుర్తు చేశారు. ఆ కష్టాలను గుర్తించిన ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంభ పెద్దలా ఆలోచించి కల్యాణ లక్ష్మీ వంటి పథకాలను తీసుకువచ్చారన్నారు. కల్యాణ లక్ష్మీ ..షాదీ ముబారక్ పథకాలు పేదలకు వరంగా మారాయన్నారు.


ప్రస్తుతం పార్టీలు, కులమతాలకతీతంగా ప్రతిఒక్కరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. కరోనా విస్తృతంగా వ్యాప్తి చెందుతున్న తరుణం లో ప్రదొ ఒక్కరు ఎవరి కి వారు తగు జాగ్రత్తలు పాటిస్తూ తమ రోజు వారీ కార్యకలాపాల్లో పాల్గొనాలని మంత్రి అన్నారు. పెన్ పహాడ్ ఎంపీపి  కార్యాలయంలో జరిగిన చెక్కుల పంపిణీ కార్యక్రమంలో మంత్రి తో పాటు ఎంపీపీ నెమ్మాది భిక్షం, చెవ్వేంల ఎంపీపీ కుమారి బాబు నాయక్, జడ్పీటీసీ మామిడి అనిత, చివ్వేంల జడ్పిటిసి సంజీవ నాయక్ తదితరులు పాల్గొన్నారు.logo