గురువారం 03 డిసెంబర్ 2020
Telangana - Nov 09, 2020 , 23:09:39

యాదాద్రి ఆలయ సమీపంలో అగ్నిప్రమాదం

యాదాద్రి ఆలయ సమీపంలో అగ్నిప్రమాదం

యాదాద్రి భువనగిరి : యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో అగ్నిప్రమాదం జరిగింది. యాదాద్రి ఆలయ వసతి గృహ సముదాయం తులసీ కాటేజీ ‌పక్కన చెత్త తగలపెడుతుండగా ప్రమాదవశాత్తు మంటలు వ్యాపించాయి. చూస్తుండగానే వసతి గృహ సముదాయం వద్ద ఉంచిన ఐరన్ పైపులకు మంటలు అంటుకోవడంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలు అలుముకున్నాయి. అధికారులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్న  వారు ఫైరింజన్ సాయంతో‌ మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించడంతో పెను ప్రమాదం తప్పింది.  అగ్ని ప్రమాదం ఎలా జరిగిందనే దానిపై అధికారులు విచారణ చేపట్టారు. ప్రమాదంలో ఆస్తి నష్టంపైనా అంచనా వేస్తున్నారు.

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.