శనివారం 16 జనవరి 2021
Telangana - Dec 28, 2020 , 00:21:19

ఏపీలో్ర పమాదం.. ఇద్దరు సజీవ దహనం

 ఏపీలో్ర పమాదం.. ఇద్దరు సజీవ దహనం

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ఏపీలోని అనంతపురం జిల్లా గుత్తి-నెల్లూరు హైవేపై ఆదివారం  సాయంత్రం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు సజీవ దహనమయ్యారు. పోలీసుల వివరాల ప్రకారం.. యాడికి మండలం బోగలకట్టకు చెందిన రోశిరెడ్డి (65), నారాయణరెడ్డి (45) గుత్తి సమీపంలోని బాట సుంకులమ్మ దేవాలయానికి ద్విచక్రవాహనంపై వెళ్లారు. తిరిగి గ్రామానికి వస్తుండగా.. గుత్తి మండలం ఎంగిలిబండ-కొత్తపేట మధ్య ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టారు. దీంతో ద్విచక్రవాహనంలోని పెట్రోలు బయటకు వచ్చి వెంటనే మంటలు చెలరేగాయి. మంటలు రోశిరెడ్డి, నారాయణరెడ్డికి అంటుకోవడంతో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందారు. లారీ పాక్షికంగా, బైక్‌ పూర్తిగా కాలిపోయాయి.