శనివారం 15 ఆగస్టు 2020
Ashoka Developers
Telangana - Jul 26, 2020 , 10:21:13

గొర్రుకు విద్యుత్‌ తీగలు తగిలి రైతు మృతి

గొర్రుకు విద్యుత్‌ తీగలు తగిలి రైతు మృతి

ఖమ్మం : జిల్లాలోని తిరుమలాయపాలెం మండలం బచ్చోడు గ్రామంలో విషాదం నెలకొంది. పొలంలో వరి నాటు వేసేందుకు ఆదివారం ఉదయం ఓ రైతు నాగలి(గొర్రు)ని తీసుకెళ్తుండగా.. ప్రమాదవశాత్తు అది విద్యుత్‌ తీగలకు తగిలింది. దీంతో పంట పొలంలోనే రైతు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనను గమనించిన సమీప పొలాల రైతులు.. అక్కడికి చేరుకుని విద్యుత్‌ అధికారులకు సమాచారం అందించారు. విద్యుత్‌ సరఫరాను నిలిపివేసి.. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతుడి నివాసంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.


logo