సోమవారం 01 జూన్ 2020
Telangana - May 03, 2020 , 12:48:49

నెలరోజులుగా బ్రిడ్జి కిందనే నివాసం

నెలరోజులుగా బ్రిడ్జి కిందనే నివాసం

యాదాద్రి భువనగిరి : దేశవ్యాప్తంగా కరోనా వల్ల విధించిన లాక్‌డౌన్‌ నేపథ్యంలో రోజువారీ వేతన జీవులు, వలస కూలీలు, నిరుపేదలు ఎంత దుర్భర స్థితిని అనుభవిస్తున్నారో తెలిసిందే. దిక్కుతోచని స్థితిలో చిన్న సహాయం కోసం కూడా తడిఆరిన కళ్లతో ఎదురు చూపులు చూస్తున్నారు. ఇటువంటి వ్యథలు ఎదుర్కొంటున్న ఓ కుటుంబం నెల రోజులుగా బ్రిడ్జి కింద్రనే నివసిస్తూ జీవితాన్ని ఎట్టుకొస్తుంది. మహబూబ్‌నగర్‌కు చెందిన గంగాధర్‌ అనే వ్యక్తి గత ఐదేళ్లుగా యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఆలేరులో చిత్తు కాగితాలు, ప్లాస్టిక్‌ బాటిల్స్‌ ఏరుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. గంగాధర్‌కు భార్య, ఏడేళ్ల కుమార్తె ఉంది. ఆలేరులోని బస్టాండ్‌, రైల్వే స్టేషన్‌ పరిసరాల్లో బస చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. కాగా కరోనా కారణంగా వీరి జీవనం కష్టంగా మారింది. ఆలేరు బస్‌స్టాండ్‌లో ఉన్న వీరిని అక్కడినుంచి పంపేయడంతో దిక్కుతోచని స్థితిలో ఓ బ్రిడ్జి కింద తలదాచుకుంటున్నారు. అది నెలరోజులుగా.


logo