సోమవారం 10 ఆగస్టు 2020
Telangana - Jul 14, 2020 , 03:36:08

బావిలో శునకం..

బావిలో శునకం..

  • 56 అడుగుల లోతు.. 24 గంటలు శ్రమ
  • కాపాడిన జంతు సంరక్షణ బృందం సభ్యులు

దుగ్గొండి: ఓ శునకం ప్రమాదవశాత్తు బావిలో పడిపోయింది. నీటిలో పడి గిలగిల కొట్టుకుంటుంటే ఆ బావి యజమాని వెంకట్రామ్‌ కుమారుడు నాగరాజు చూస్తూ ఊరుకోలేదు. ఉన్న నీటినంతా మోటర్‌ సాయంతో తోడేశారు. 56 అడుగుల లోతు ఉండటంతో అది బయటకు రాలేకపోయింది. హైదరాబాద్‌ నుంచి జంతు సంరక్షణ బృందాన్ని పిలిపించారు. వారు కొన్ని గంటలు శ్రమించి ఆ శునకాన్ని క్షేమంగా బయటకు తీసుకు రాగలిగారు. మొత్తానికి 24 గంటల తరువాత ఆ శునకం ఒడ్డుకు చేరింది. ఈ ఘటన వరంగల్‌ రూరల్‌ జిల్లా దుగ్గొండి మండలం నారాయణతండాలో ఆదివారం ఉదయం చోటుచేసుకోగా సోమవారం ఉదయం కథ సుఖాంతమైంది. 


logo