సోమవారం 10 ఆగస్టు 2020
Telangana - Jul 08, 2020 , 14:31:13

నేరస్థుల పాలిట సింహ స్వప్నం ‘మార్షల్’ ఇక లేదు

నేరస్థుల పాలిట సింహ స్వప్నం ‘మార్షల్’ ఇక లేదు

సంగారెడ్డి : ఉమ్మడి మెదక్ జిల్లాలో ట్రాకర్ డాగ్ గా ఎంపికై, దొంగతనాలు, మర్డర్ వంటి నేరాలకు పాల్పడిన వారిని గుర్తించడంలో చురుకుగా వ్యవహరించి, అధికారుల మన్నలను పొందిన మార్షల్( పోలీసు జాగిలం) కన్నుమూసింది. జర్మన్ శపర్డ్ జాతికి చెందిన ఈ పోలీసు జాగిలం అనారోగ్య కారణాలతో మంగళవారం రాత్రి మృతి చెందింది. ఈ జాగిలం మృతిపై సంగారెడ్డి జిల్లా ఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. మార్షల్ నేరస్థులను పట్టుకోవడంలో దిట్ట. 

నేరానికి పాల్పడి, సంఘటనా స్థలం నుంచి పారిపోయిన నేరస్థులను వెంబడించి గుర్తించడంలో కఠిన శిక్షణ పొందింది. మొదట ఉమ్మడి మెదక్ జిల్లాలో విధులు నిర్వహించి, జిల్లాల విభజన అనంతరం సంగారెడ్డి జిల్లాలో విధులు నిర్వహిస్తూ వస్తున్నది. మార్షల్ తన 9 సంవత్సరాల సర్వీస్ లో 30 కేసుల్లో నిందితులను గుర్తించి అధికారుల మన్ననలను పొందినట్లు డాగ్ హ్యాండ్లర్ బసవరాజ్ తెలిపారు. జాగిలం అంత్యక్రియలకు ఆర్ఐలు హరిలాల్, డానియల్, కృష్ణ, ఆర్ఎస్ఐ హనుమంత్ రెడ్డి , డాగ్ హ్యాండ్లర్స్ యాదవ్ రావ్, జగదీశ్వర్, హనుమంతు, అంజయ్య తదితరులు పాల్గొన్నారు.


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo